'టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా మమ్మల్ని గుర్తించండి' | TDP mlas wrote a letter to assembly speaker | Sakshi
Sakshi News home page

'టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా మమ్మల్ని గుర్తించండి'

Mar 9 2016 6:05 PM | Updated on Aug 10 2018 7:19 PM

'టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా మమ్మల్ని గుర్తించండి' - Sakshi

'టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా మమ్మల్ని గుర్తించండి'

టీటీడీపీకి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరడానికి నిర్ణయించుకున్నారు.

హైదరాబాద్: టీటీడీపీకి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి లేఖ రాశారు. తమను టీఆర్ఎస్ శాసనసభాపక్షంలో చేర్చుకోవాలని తమ లేఖలో టీడీపీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీలో విలీనం అయినట్టుగా గుర్తించాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు.

టీటీడీపీలో  ఇక ముగ్గురే..!
మాగంటి గోపీనాథ్ సోమవారం ఉదయమే సీఎం కేసీఆర్‌ను కలసి తమ చేరిక గురించి చర్చించారు. మంగళవారం అరికెపూడి గాంధీతో కలసి మరోసారి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలూ పార్టీ మారితే.. ఇక తెలంగాణ టీడీపీకి మిగిలేది ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే కావడం గమనార్హం. టీడీపీలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మాత్రమే మిగిలారు.

Advertisement
 
Advertisement
Advertisement