బంజారాహిల్స్ లో హోటల్పై పోలీసుల దాడి | Task Force police raids at hotel in Banjara Hills road no 4 | Sakshi
Sakshi News home page

బంజారాహిల్స్ లో హోటల్పై పోలీసుల దాడి

Aug 14 2014 10:11 AM | Updated on Aug 25 2018 5:29 PM

బంజారాహిల్స్ లో హోటల్పై పోలీసుల దాడి - Sakshi

బంజారాహిల్స్ లో హోటల్పై పోలీసుల దాడి

నగరంలోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 4లోని ఓ హోటల్పై టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు.

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 4లోని ఓ హోటల్పై టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. ఈ సందర్బంగా యువతి, ఇద్దరు యువకులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించారు. హోటల్లో వ్యభిచారం జరుగుతుందని పోలీసులకు ఆగంతకులు సమాచారం అందించారు.

దాంతో పోలీసులు సదరు హోటల్పై దాడి చేశారు. ఈ సందర్బంగా యువతి, ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారు పొంతన లేని సమాధానాలు వెల్లడిస్తుండటంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement