నోముల పార్టీ వీడడం బాధాకరం: తమ్మినేని | Tammineni Veerabhadram Comments on Nomula Narsimhaiah Resigns To CPM | Sakshi
Sakshi News home page

నోముల పార్టీ వీడడం బాధాకరం: తమ్మినేని

Apr 8 2014 2:49 PM | Updated on Aug 13 2018 8:10 PM

నోముల పార్టీ వీడడం బాధాకరం: తమ్మినేని - Sakshi

నోముల పార్టీ వీడడం బాధాకరం: తమ్మినేని

తాము ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతామని తెలంగాణ రాష్ట్ర సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మంగళవారం హైదరాబాద్లో స్పష్టం చేశారు.

తాము ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతామని తెలంగాణ రాష్ట్ర సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మంగళవారం హైదరాబాద్లో స్పష్టం చేశారు. ఇప్పటికి 38 ఎమ్మెల్యేలు, 3 ఎంపీ స్థానాలు ఖరారు చేసినట్లు తెలిపారు. మరో మూడు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఖరారు చేయనున్నట్లు చెప్పారు. నోముల నర్సింహయ్య పార్టీ వీడడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు.

 

నోముల సీపీఎం పార్టీతో ఉన్న అనుబంధాన్ని తమ్మినేని ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు.  తమ పార్టీ అభివృద్ధి ప్రణాళిక ఈ నెల13 లేదా 14న ప్రకటిస్తామన్నారు. మంగళవారం ఉదయం హైదరాబాద్లో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం నోముల నర్సింహయ్య తీసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement