రైతులపై ప్రభుత్వం నిర్లక్ష్యం | T.Jeevan Reddy about farmers problems | Sakshi
Sakshi News home page

రైతులపై ప్రభుత్వం నిర్లక్ష్యం

Jun 11 2017 2:28 AM | Updated on Aug 15 2018 9:40 PM

రైతులపై ప్రభుత్వం నిర్లక్ష్యం - Sakshi

రైతులపై ప్రభుత్వం నిర్లక్ష్యం

వ్యవసాయం, రైతులపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి ఆరోపించారు.

సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయం, రైతులపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి ఆరోపించారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రైతులు విక్రయించిన ధాన్యానికి ఇంకా పూర్తి డబ్బులు చెల్లించలేదని, ఖాతాల్లో కొందరికి డబ్బులు వేసినా బ్యాంకులు ఇవ్వడం లేదన్నారు.

సబ్సిడీపై నాణ్య మైన విత్తనాలను ప్రభుత్వం అందించలేకపోయిందని ఆరోపించారు. మిర్చి, కందులు కొనడంలో ప్రభుత్వం విఫలమైందని, గిట్టుబాటు ధరలను చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్‌ రైతులను పట్టించుకోవాలని జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement