స్విస్ ఛాలెంజ్.. పెద్ద మ్యాచ్ ఫిక్సింగ్ | Swiss challenge method should be cancelled, says buggana | Sakshi
Sakshi News home page

స్విస్ ఛాలెంజ్.. పెద్ద మ్యాచ్ ఫిక్సింగ్

Sep 14 2016 5:05 PM | Updated on Aug 18 2018 8:08 PM

స్విస్ ఛాలెంజ్.. పెద్ద మ్యాచ్ ఫిక్సింగ్ - Sakshi

స్విస్ ఛాలెంజ్.. పెద్ద మ్యాచ్ ఫిక్సింగ్

చంద్రబాబు వెంటనే స్విస్ ఛాలెంజ్ విధానాన్ని రద్దు చేయాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డిమాండ్ చేశారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్విస్ ఛాలెంజ్ విధానాన్ని రద్దు చేయాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. స్విస్ ఛాలెంజ్ విధానంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిందని గుర్తు చేస్తూ, రాష్ట్రంలో పాలన ఉందా లేదా అన్న అనుమానం కలుగుతోందని విమర్శించారు.

సింగపూర్ కంపెనీలతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నట్టు అర్థమవుతోందని బుగ్గన చెప్పారు.  సింగపూర్  కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలు పారదర్శకంగా లేవని కోర్టు పేర్కొందని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా స్విస్ ఛాలెంజ్లో నిబంధనలున్నాయని, సింగపూర్ కంపెనీలను ఇంటి అల్లుడి కంటే ఎక్కువగా చంద్రబాబు ప్రభుత్వం చూస్తోందని బుగ్గన ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement