కాలేజీ ముందు విద్యార్థి తల్లిదండ్రుల ఆందోళన | suicide student parents protest at CMR College | Sakshi
Sakshi News home page

కాలేజీ ముందు విద్యార్థి తల్లిదండ్రుల ఆందోళన

Nov 6 2015 5:27 PM | Updated on Nov 6 2018 8:28 PM

రంగారెడ్డి జిల్లాలో మూడు రోజుల క్రితం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు సీఎంఆర్ కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు.

మేడ్చల్: రంగారెడ్డి జిల్లాలో మూడు రోజుల క్రితం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు సీఎంఆర్ కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

సీఎంఆర్ కాలేజీలో భార్గవ్ అనే విద్యార్థి బీఫార్మసీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అతడి హాజరు 50 శాతం కంటే తక్కువ ఉండటంతో ల్యాబ్ పరీక్షకు ప్రిన్సిపల్ అనుమతించలేదని చెప్పారు. దీంతో తీవ్ర మనస్తాపంతో భార్గవ్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి యాజమాన్యమే బాధ్యత వహించి న్యాయం చేయాలని తల్లిదండ్రులు విద్యార్థులతో కలిసి ఆందోళన చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement