సికింద్రాబాద్‌–రెక్సాల్‌ మధ్య ప్రత్యేక రైళ్లు | Special trains between Secunderabad-reksal | Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్‌–రెక్సాల్‌ మధ్య ప్రత్యేక రైళ్లు

Mar 21 2017 12:36 AM | Updated on Sep 5 2017 6:36 AM

వేసవి రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్‌–రెక్సాల్‌ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

సాక్షి, హైదరాబాద్‌: వేసవి రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్‌–రెక్సాల్‌ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్‌–రెక్సాల్‌ (07091/07092) ప్రత్యేక రైలు ఈ నెల 28, ఏప్రిల్‌ 4, 11, 18, 25, మే 2, 9, 16, 23, 30 జూన్‌ 6, 13, 20, 27 తేదీల్లో రాత్రి 9.40కి సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి రెండవ రోజు సాయంత్రం 6.15కు రెక్సాల్‌ చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో ఈ నెల 31, ఏప్రిల్‌ 7, 14, 21, 28, మే 5, 12, 19, 26, జూన్‌ 2, 9, 16, 23, 30 తేదీల్లో మధ్యాహ్నం 12.45కు రెక్సాల్‌ నుంచి బయలుదేరి రెండవ రోజు ఉదయం 6.55కు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement