'మీ ఓటును సరి చూసుకోండి' | Special Promotional Day for Voter list | Sakshi
Sakshi News home page

'మీ ఓటును సరి చూసుకోండి'

Oct 10 2015 7:50 PM | Updated on Sep 3 2017 10:44 AM

'మీ ఓటును సరి చూసుకోండి'

'మీ ఓటును సరి చూసుకోండి'

ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజక వర్గాల పరిధిలో ఓటరు జాబితాల్లో ప్రజలు తమ వివరాలను తెలుసుకోవడానికి, నూతన ఓటరు నమోదు, సవరణ, తొలగింపు, చిరునామా మార్పు, ఫొటోల సవరణపై ఆదివారం ప్రత్యేక ప్రచార దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ సర్కిల్-10(ఏ,బీ) ఉప కమిషనర్లు మహేందర్, సామ్రాట్ అశోక్ శనివారం తెలిపారు.

బంజారాహిల్స్ : ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజక వర్గాల పరిధిలో ఓటరు జాబితాల్లో ప్రజలు తమ వివరాలను తెలుసుకోవడానికి, నూతన ఓటరు నమోదు, సవరణ, తొలగింపు, చిరునామా మార్పు, ఫొటోల సవరణపై ఆదివారం ప్రత్యేక ప్రచార దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ సర్కిల్-10(ఏ,బీ) ఉప కమిషనర్లు మహేందర్, సామ్రాట్ అశోక్ శనివారం తెలిపారు.

ఈ రెండు నియోజక వర్గాల పరిధిలో ప్రతి పోలింగ్ స్టేషన్‌లోను బూత్‌లెవల్ ఆఫీసర్లు అందుబాటులో ఉంటారని, ఈ అవకాశాన్ని ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో ఓటర్లు అన్ని వివరాలను తెలుసుకోవడానికి వీలుంటుందని చెప్పారు. ప్రతి పోలింగ్‌బూత్‌లో ఓటర్ల ముసాయిదా జాబితాతో పాటు ఫారం-6,7, 8, 8ఏలను అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement