సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బలవన్మరణం | Software Engineer Bureau | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బలవన్మరణం

Jan 5 2014 4:16 AM | Updated on Nov 6 2018 7:53 PM

ప్రియుడి తల్లిదండ్రులు తమ ప్రేమను అంగీకరించడంలేదని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడింది. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఈ ఘటన జరిగింది.

మలేసియాటౌన్‌షిప్, న్యూస్‌లైన్: ప్రియుడి తల్లిదండ్రులు తమ ప్రేమను అంగీకరించడంలేదని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడింది. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఈ ఘటన జరిగింది. ఎస్సై రాజేష్ కథనం ప్రకారం... నిజాంపేటలో ఉండే కృష్ణమోహన్ కుమార్తె స్వాతి (26) బంజారాహిల్స్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగి. శనివారం ఉదయం 10 గంటల సమయంలో స్నానం చేయడానికి తన బెడ్‌రూంలోకి వెళ్లిన స్వాతి తిరిగి రాలేదు.

గమనించిన తల్లి తలుపు తట్టినా తెరచుకోలేదు. దీంతో తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగ స్వాతి ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకొని కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి మృతురాలి తల్లిదండ్రులను విచారించగా... ఇటీవల కొండాపూర్‌కు చెందిన ఓ యువకుడితో స్వాతికి పరిచయం ఏర్పడి ప్రేమించుకుంటున్నారని తెలిసింది.

ఈ విషయాన్ని ఇద్దరూ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. స్వాతి తల్లిదండ్రులు వీరి ప్రేమను అంగీకరించగా.. అబ్బాయి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో మనస్తాపం చెందిన స్వాతి బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement