ఇది భూకబ్జాల ప్రభుత్వం: షబ్బీర్‌ | Shabbir ali on trs Government | Sakshi
Sakshi News home page

ఇది భూకబ్జాల ప్రభుత్వం: షబ్బీర్‌

Jun 16 2017 1:57 AM | Updated on Aug 15 2018 9:40 PM

ఇది భూకబ్జాల ప్రభుత్వం: షబ్బీర్‌ - Sakshi

ఇది భూకబ్జాల ప్రభుత్వం: షబ్బీర్‌

టీఆర్‌ఎస్‌ సర్కార్‌ కబ్జా ల ప్రభుత్వంగా మారిం దని శాసన మండలి కాంగ్రెస్‌ పక్ష నేత షబ్బీర్‌ అలీ విమర్శించారు.

తాండూరు టౌన్‌: టీఆర్‌ఎస్‌ సర్కార్‌ కబ్జా ల ప్రభుత్వంగా మారిం దని శాసన మండలి కాంగ్రెస్‌ పక్ష నేత షబ్బీర్‌ అలీ విమర్శించారు. గురువారం ఆయన వికారాబాద్‌ జిల్లా తాండూ రులో కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందుకు హాజరయ్యారు. రూ.15వేల కోట్ల భూము లు అన్యాక్రాంతమైనా ఒక్క గజం కూడా కబ్జా కాలేదని చెబుతున్న కేసీఆర్‌ తీరుపై అనుమానాలు కలుగుతున్నాయని ఆయన అన్నారు.

అధికారులను బదిలీ చేసినంత మాత్రాన చేసిన తప్పులు మాసిపోవన్నా రు. కేసు దర్యాప్తులో ఉండగా నిబంధ నలకు విరుద్ధంగా కేసీఆర్‌ వివరణ ఇవ్వ డాన్ని బట్టి చూస్తే స్కాం లోతు ఎంత ఉందో అర్థమ వుతోందన్నారు. ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలన్నారు. ఆ భూము లను స్వాధీన పరుచుకుని పేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు నిర్మించేలా చూడాలని గవర్నర్‌కు కోరామన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement