మంచినీటికి బదులు మురుగు నీరు | Sewage water instead of Drinking water | Sakshi
Sakshi News home page

మంచినీటికి బదులు మురుగు నీరు

May 22 2016 4:17 PM | Updated on Sep 4 2018 5:21 PM

నగరంలోని పలుచోట్ల ఆదివారం మధ్యాహ్నం మంచినీటికి బదులు మురుగు నీరు సరఫరా జరిగింది.

 నగరంలోని పలుచోట్ల ఆదివారం మధ్యాహ్నం మంచినీటికి బదులు మురుగు నీరు సరఫరా జరిగింది. సీతారాంబాగ్, మల్లేపల్లి, బోయిగూడ కమాన్, మంగళహాట్, ఆగాపురా, ఇందిరానగర్ ప్రాంతాల్లో ఈరోజు మురుగునీరు సరఫరా అయింది. ఈ నీటిని తోడుకోలేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. రెండు రోజులుగా వాటర్ వర్క్స్ అధికారులు ఇలాంటి నీటినే సరఫరా చేస్తుండటంతో.. ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement