చిన్నారి కిడ్నాప్ కలకలం | seven months baby kidnaped in hyderabad chanda nagar | Sakshi
Sakshi News home page

చిన్నారి కిడ్నాప్ కలకలం

Apr 27 2016 12:22 PM | Updated on Sep 4 2018 5:21 PM

నగరంలోని చందానగర్లో బుధవారం ఉదయం చిన్నారి కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఇంట్లో ఆడుకుంటున్న ఏడు నెలల చిన్నారిని గుర్తు తెలియని దుండగులు ఎత్తుకుపోయారు.

హైదరాబాద్: నగరంలోని చందానగర్లో బుధవారం ఉదయం చిన్నారి కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఇంట్లో ఆడుకుంటున్న ఏడు నెలల  చిన్నారిని గుర్తు తెలియని దుండగులు ఎత్తుకుపోయారు.

నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన దంపతులు పదిహేను రోజుల క్రితం నగరానికి వచ్చి లింగంపల్లిలోని పాత మున్సిపల్ ఆఫీసు వద్ద నివాసముంటున్నారు. బుధవారం ఉదయం కుటుంబసభ్యులు ఇంటి పనుల్లో బిజీగా ఉండగా ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారిని గుర్తు తెలియని దుండగులు ఎత్తుకుపోయారు. కొద్దిసేపటి తర్వాత చిన్నారి కనిపించడం లేదని గుర్తించిన కుటుంబసభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో బాధితులు చందానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement