స్కాలర్స్ లిస్టు పంపండి: వీసీ అప్పారావు | Send Scholars list: VC Appa Rao | Sakshi
Sakshi News home page

స్కాలర్స్ లిస్టు పంపండి: వీసీ అప్పారావు

Apr 27 2016 5:46 AM | Updated on Sep 3 2017 10:53 PM

స్కాలర్స్ లిస్టు పంపండి: వీసీ అప్పారావు

స్కాలర్స్ లిస్టు పంపండి: వీసీ అప్పారావు

ఐదేళ్ల కాలపరిమితి పూర్తి చేసుకున్న పరిశోధక విద్యార్థుల జాబితా పంపాలంటూ వివిధ విభాగాల డీన్‌లకు హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ అప్పారావు ఆదేశాలు జారీచేశారు.

సాక్షి, హైదరాబాద్: ఐదేళ్ల కాలపరిమితి పూర్తి చేసుకున్న పరిశోధక విద్యార్థుల జాబితా పంపాలంటూ వివిధ విభాగాల డీన్‌లకు హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ అప్పారావు ఆదేశాలు జారీచేశారు. కోర్సు పూర్తి అయినా కాకున్నా ఐదేళ్లు పూర్తయితే విద్యార్థులు హాస్టల్ ఖాళీ చేయాలని డీన్‌లకు తేల్చి చెప్పారు.

ఇదిలా ఉండగా విద్యార్థులపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే డీన్స్‌కి ఆదేశాలు జారీచేసినట్టు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. గతంలో వర్సిటీలో వివిధ కోర్సులు చేస్తున్న విద్యార్థుల కాలపరిమితి పూర్తయినప్పటికీ గైడ్ అనుమతితో గడువు పెంచుకునే అవకాశం ఉండేది. ఇప్పుడా అవకాశం లేకుండా చేసి విద్యార్థులను క్యాంపస్ నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అంబేడ్కర్ అసోసియేషన్ కన్వీనర్ మున్నా, ఎస్సీ, ఎస్టీ ఫ్యాకల్టీ  ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement