ఎస్సీ కార్పొరేషన్‌ నిధులు విడుదల చేయాలి | SC Corporation should release funds | Sakshi
Sakshi News home page

ఎస్సీ కార్పొరేషన్‌ నిధులు విడుదల చేయాలి

Jul 28 2017 1:25 AM | Updated on Aug 16 2018 1:18 PM

ఎస్సీ కార్పొరేషన్‌ నిధులు విడుదల చేయాలి - Sakshi

ఎస్సీ కార్పొరేషన్‌ నిధులు విడుదల చేయాలి

ఎస్సీ కార్పొరేషన్‌ వరుసగా మూడేళ్లుగా రుణాలు ఇవ్వడంలేదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి చెప్పా రు.

మల్లు రవి డిమాండ్‌
సాక్షి, హైదరాబాద్‌: ఎస్సీ కార్పొరేషన్‌ వరుసగా మూడేళ్లుగా రుణాలు ఇవ్వడంలేదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి చెప్పా రు. గురువారం ఆయన మాట్లాడుతూ 2014లో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎస్సీ కార్పొరేషన్‌ ఎలాంటి రుణాలు ఇవ్వలేదని, ఎస్సీ నిరుద్యోగులను ఆదుకోవడానికి తీసుకున్న చర్యలేమీ లేవని అన్నారు.

బడ్జెట్‌లో పెట్టినా, నిధులను ప్రభుత్వం మంజూరు చేయకపోవడంవల్ల బ్యాంకులు రుణాలను ఇవ్వడం లేదని, నిరుద్యోగ యువతపై ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని చెప్పారు. ఎస్సీ కార్పొరేషన్‌కు ప్రభుత్వం తక్షణమే నిధులను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్‌ ఏం మాట్లాడారో, సీఎం ఇచ్చిన హామీలేమిటో ప్రజలకు వెల్లడించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement