రష్యా కళాకారిణి బ్యాగ్ మాయం | russian dancer s bag was stolen | Sakshi
Sakshi News home page

రష్యా కళాకారిణి బ్యాగ్ మాయం

Dec 27 2014 5:10 PM | Updated on Sep 2 2017 6:50 PM

రష్యా కళాకారిణి బ్యాగ్ మాయం

రష్యా కళాకారిణి బ్యాగ్ మాయం

రష్యాకు చెందిన కూచిపూడి కళాకారిణి బ్యాగ్ మాయమైంది. నాల్గవ అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనంలో పాల్గొనేందుకు రష్యాకు చెందిన అలీఫా కుచ్‌తోవా గచ్చిబౌలి....

గచ్చిబౌలి: రష్యాకు చెందిన కూచిపూడి కళాకారిణి బ్యాగ్ మాయమైంది. నాల్గవ అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనంలో పాల్గొనేందుకు రష్యాకు చెందిన అలీఫా కుచ్‌తోవా గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంకు వచ్చారు. బ్యాగ్‌ను స్టేడియంలోని మేకప్ రూమ్‌లో పెట్టి నాట్యం చేసేందుకు శుక్రవారం ఉదయం 11.30కి వేదికపైకి వెళ్లారు. నాట్య ప్రదర్శన ముగించుకొని మేకప్ రూమ్‌కి వెళ్లి చూడగా బ్యాగ్ కనిపించ లేదు. బ్యాగులో పాస్‌పోర్టుతో పాటు డబ్బులు, పలు గుర్తింపు కార్డులున్నాయని బాధితురాలు తన కుటుంబసభ్యులకు ఫోన్ చేసి కన్నీరుపెట్టుకున్నారు. అనంతరం గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement