హైదరాబాద్లో రూ.77 లక్షలు పట్టివేత | Rs.77 lakhs seized in attapur in hyderabad city | Sakshi
Sakshi News home page

హైదరాబాద్లో రూ.77 లక్షలు పట్టివేత

Jan 19 2016 12:01 PM | Updated on Sep 3 2017 3:55 PM

హైదరాబాద్లో రూ.77 లక్షలు పట్టివేత

హైదరాబాద్లో రూ.77 లక్షలు పట్టివేత

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు సమీస్తున్న నేపథ్యంలో అత్తాపూర్ వద్ద మంగళవారం రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు సమీస్తున్న నేపథ్యంలో అత్తాపూర్ వద్ద మంగళవారం రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించారు.  ఈ సందర్భంగా కారులో తరలిస్తున్న రూ. 77 లక్షలను అధికారులు స్వాధీనం చేసుకుని... పోలీసులకు అప్పగించారు. అనంతరం కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. రెవెన్యూ అధికారి సంగీత ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు.

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు తనిఖీలు మమ్మురం చేశారు. అదికాక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పలు పార్టీలకు చెందిన రెబల్ అభ్యర్థులు బరిలో దిగారు. వారిని బుజ్జగించి... నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేసేందుకు వివిధ పార్టీలకు చెందిన నాయకులు రంగంలోకి దిగారు. అందులోభాగంగా రెవెన్యూ అధికారులు వాహనాల తనిఖీలు చేపట్టారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement