రోజా పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ | roja suspension petition in supreme court | Sakshi
Sakshi News home page

రోజా పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ

Mar 11 2016 1:45 PM | Updated on Sep 2 2018 5:24 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్కు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది.

న్యూఢిల్లీ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్కు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది. ఏడాదిపాటు తనపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని పేర్కొంటూ ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని శుక్రవారం విచారణకు చేపట్టిన జస్టిస్ జగదీశ్ కెహర్ మరో బెంచ్కు బదిలీ చేయాలని సూచించారు. దీంతో సోమవారం మరోసారి కేసును రోజా తరుపు న్యాయవాది ప్రస్తావించనున్నారు.

రాష్ట్రాన్ని కుదిపేసిన కాల్‌మనీ-సెక్స్‌రాకెట్‌పై వైఎస్సార్‌సీపీ శాసనసభ సమావేశాల్లో చర్చకు పట్టుబట్టిన సందర్భంగా ఎమ్మెల్యే రోజా అనుచితంగా నినాదాలిచ్చారంటూ ఆమెను రూల్ 340(2) ప్రకారం ఏడాదిపాటు సస్పెండ్ చేయాలని శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు తీర్మానం ప్రతిపాదించడం, స్పీకర్ మూజువాణి ఓటుతో దాన్ని ఆమోదించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement