మలక్‌పేటలో భారీ చోరీ | robbery in malakpet | Sakshi
Sakshi News home page

మలక్‌పేటలో భారీ చోరీ

Nov 19 2016 4:00 PM | Updated on Aug 30 2018 5:27 PM

మలక్‌పేటకు చెందిన ఓ వ్యాపారి ఇంట్లో శుక్రవారం రాత్రి భారీ చోరీ జరిగింది.

హైదరాబాద్: మలక్‌పేటకు చెందిన ఓ వ్యాపారి ఇంట్లో శుక్రవారం రాత్రి భారీ చోరీ జరిగింది. స్థానిక ప్రొఫెసర్స్ కాలనీకి చెందిన ప్రదీప్ జైన్ కుటుంబసభ్యులు ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు లోపలికి ప్రవేశించి బీరువాలో ఉంచిన 40 తులాల బంగారు ఆభరణాలతోపాటు రూ. 80 వేల నగదును ఎత్తుకుపోయారు. శనివారం గమనించిన వ్యాపారి కుటుంబసభ్యులు మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు క్లూస్‌టీంను రప్పించి వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement