గ్యాస్ ట్యాంకర్ని ఢీకొట్టిన టిప్పర్ | Road accident: cleaner daid | Sakshi
Sakshi News home page

గ్యాస్ ట్యాంకర్ని ఢీకొట్టిన టిప్పర్

Aug 27 2014 8:39 PM | Updated on Aug 30 2018 3:58 PM

హయత్ నగర్ అబ్దుల్లాపూర్ వద్ద టిప్పర్ గ్యాస్ ట్యాంకర్ని ఢీకొట్టింది.

హైదరాబాద్:హయత్ నగర్ అబ్దుల్లాపూర్ వద్ద టిప్పర్ గ్యాస్ ట్యాంకర్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్ క్లీనర్ మృతి చెందాడు. డ్రైవర్ కూడా లోపల ఇరుక్కుపోయినట్లు చెబుతున్నారు. విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు రెండు కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి.వాహనాలలోని ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు.  

ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్ అవుతుందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అది ఖాళీ ట్యాంకర్ అని పోలీసులు చెబుతున్నారు. గ్యాస్ లీక్ అనేది వాస్తవం కాదని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement