breaking news
cleaner daid
-
ఒకదానికొకటి మూడు లారీల ఢీ
గుడ్లూరు: మూడు లారీలు ఒక దానికొకటి ఢీకొనడంతో ఓ లారీ క్లీనర్ మృతి చెందగా ఇద్దరు డ్రైవర్లుకు గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని జాతీయ రహదారిపై చేవూరు జంక్షన్ వద్ద శనివారం అర్ధరాత్రి జరిగింది. అందిన వివరాల ప్రకారం.. చెన్నై నుంచి విజయవాడ వెళ్తున్న లారీని చేవూరు వద్దకు వచ్చే సరికి వెనుకనే వస్తున్న మరో లారీ ఓవర్ టేక్ చేయబోయి అదుపుతప్పి ఢీకొట్టింది. అదే సమయంలో వెనుకనే వస్తున్న మరో లారీ మధ్యలో లారీని వేగంగా వచ్చి ఢీకొట్టడంతో మధ్య లారీ డోరు ఊడి పోవడంతో క్లీనర్ రమేష్ (35) ఎగిరి రోడ్డుపై పడి తల పగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడి. డ్రైవర్ శ్రీనివాసులు, వెనుక లారీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ట్రాఫిక్ నిలిచి పోయింది. సమాచారం అందుకున్న హైవే సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను తమ వాహనంలో కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. క్లీనర్ రమేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కావలి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మృతుడి రమేష్‌ది విశాఖపట్నంలోని చిలకపేట గ్రామం. సంఘటన స్థలాన్ని ఇన్చార్జి ఎస్ఐ రమణయ్య, గుడ్లూరు పోలీసుస్టేషన్ రైటర్ డానియేలు పరిశీలించి వివరాలు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
గ్యాస్ ట్యాంకర్ని ఢీకొట్టిన టిప్పర్
హైదరాబాద్:హయత్ నగర్ అబ్దుల్లాపూర్ వద్ద టిప్పర్ గ్యాస్ ట్యాంకర్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్ క్లీనర్ మృతి చెందాడు. డ్రైవర్ కూడా లోపల ఇరుక్కుపోయినట్లు చెబుతున్నారు. విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు రెండు కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి.వాహనాలలోని ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్ అవుతుందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అది ఖాళీ ట్యాంకర్ అని పోలీసులు చెబుతున్నారు. గ్యాస్ లీక్ అనేది వాస్తవం కాదని చెప్పారు.