ప్రశ్నించడమే తప్పా: రేవంత్‌ | Revant Reddy on EPuri Somanna | Sakshi
Sakshi News home page

ప్రశ్నించడమే తప్పా: రేవంత్‌

Sep 3 2017 2:13 AM | Updated on Sep 17 2017 6:18 PM

ప్రశ్నించడమే తప్పా: రేవంత్‌

ప్రశ్నించడమే తప్పా: రేవంత్‌

పాలకుల అకృత్యాలను ప్రశ్నించే గొంతులను నులిమేసేలా రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు.

సాక్షి,హైదరాబాద్‌:పాలకుల అకృత్యాలను ప్రశ్నించే గొంతులను నులిమేసేలా రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. దళితులు, గిరిజన, బలహీన వర్గాల పోరాటంతో వచ్చిన తెలంగాణలో ఆ వర్గాల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు.

ఆర్మూరు, సిరిసిల్ల, ఖమ్మంలో దళితులపై జరిగిన దాడి మరిచిపోకముందే ఏపూరి సోమన్న విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. పాలకులను ప్రశ్నిస్తూ గొంతెత్తడమే ఏపూరి చేసిన నేరమా అని ప్రశ్నించారు. దీనికి బాధ్యులైన పోలీసులు, టీఆర్‌ఎస్‌ నేతలపై చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.

Advertisement
 
Advertisement
Advertisement