
హైదరాబాద్: ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీకి సీఎం రేవంత్‌రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి ఓవైసీ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ‘ ఉపరాష్ట్రపతి కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు తెలిపినందుకు ఓవైసీకి కృతజ్ఞతలు.
జాతీయ ప్రయోజనాల దృష్ట్యా మంచి నిర్ణయం తీసుకున్నారు ఓవైసీ. అసదుద్దీన్ ఓవైసీకి హృదయ పూర్వక ధన్యవాదాలు’ అంటూ తన సోషల్ మీడియా అకౌంట్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు సీఎం రేవంత్. ఓవైసీ చేసిన ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ ధన్యవాదాలు తెలిపారు సీఎం రేవంత్.
Thank you @asadowaisi bhai,
Lok Sabha MP and national president of @aimim_national for coming forward in support of Justice Sudarshan Reddy garu as Vice President with a common national interest initiative. https://t.co/tLQ7gBi8z1— Revanth Reddy (@revanth_anumula) September 7, 2025