మద్యం దుకాణాలకు నేడు రీ నోటిఫికేషన్! | Re notification for wine shops licence in hyderabad | Sakshi
Sakshi News home page

మద్యం దుకాణాలకు నేడు రీ నోటిఫికేషన్!

Sep 29 2015 8:48 AM | Updated on Sep 18 2019 2:52 PM

మద్యం దుకాణాలకు నేడు రీ నోటిఫికేషన్! - Sakshi

మద్యం దుకాణాలకు నేడు రీ నోటిఫికేషన్!

గ్రేటర్ పరిధిలో మిగిలిపోయిన 95 మద్యం దుకాణాలకు మంగళవారం రీ నోటిఫికేషన్ జారీచేసేందుకు ఆబ్కారీ శాఖ కసరత్తు చేస్తోంది.

హైదరాబాద్ : గ్రేటర్ పరిధిలో మిగిలిపోయిన 95 మద్యం దుకాణాలకు మంగళవారం రీ నోటిఫికేషన్ జారీచేసేందుకు ఆబ్కారీ శాఖ కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ జిల్లా పరిధిలో 52, రంగారెడ్డి జిల్లా పరిధిలో 33, మెదక్ జిల్లా పరిధిలోని 10 దుకాణాలకు నోటిఫికేషన్ జారీ కానున్నట్లు తెలిసింది. ఈ దుకాణాలకు దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబరు 5 వరకు అవకాశం ఇవ్వనున్నారు.
 
 అక్టోబరు 6న ఈ దుకాణాలకు డ్రా నిర్వహించనున్నా రు. తొలిదశలో ఎవరూ దరఖాస్తు చేసుకోకపోవడంతో ఈ దుకాణాలకు తిరిగి నోటిఫికేషన్ జారీ చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలో రెండేళ్ల కాలపరిమితికి లెసైన్సు ఫీజు రూ.2.16 కోట్లుగా ఉండడం,దుకాణం ఏర్పాటుకు అవసరమైన వాణిజ్య స్థలం అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో వ్యాపారులెవరూ దరఖాస్తుచేసుకోని విషయం విదితమే.రెండోదశలోనూ ఎవరూ ముందుకురాని పక్షంలో ఆయా దుకాణాలను తెలంగాణా బేవరేజస్  కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే అవకాశాలున్నట్లు ఎక్సైజ్‌శాఖ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement