ఇంటర్ ఫలితాల్లో రంగారెడ్డి టాప్ | rangareddy secures top rank in intermediate results | Sakshi
Sakshi News home page

ఇంటర్ ఫలితాల్లో రంగారెడ్డి టాప్

Apr 22 2016 11:37 AM | Updated on Sep 3 2017 10:31 PM

ఇంటర్ ఫలితాల్లో రంగారెడ్డి టాప్

ఇంటర్ ఫలితాల్లో రంగారెడ్డి టాప్

ఇంటర్మీడియెట్ ఫలితాల్లో రంగారెడ్డిజిల్లా సత్తా చాటింది.

హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో రంగారెడ్డిజిల్లా సత్తా చాటింది. శుక్రవారం విడుదలయిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో రంగారెడ్డి తొలి స్థానంలో నిలిచింది. ఫస్టియర్ ఫలితాల్లో 69 శాతం, సెకండ్ ఇయర్ ఫలితాల్లో 76 శాతంతో రంగారెడ్డి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది.

ఇక ఫస్టియర్ ఫలితాల్లో హైదరాబాద్(56 శాతం) రెండో స్థానంలో నిలవగా, సెకండ్ ఇయర్ ఫలితాల్లో ఖమ్మం(66 శాతం) రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు నల్లగొండ 41 శాతంతో  ఇంటర్ ఫస్టియర్‌లో చివరిస్థానంలోనూ, ఇంటర్ సెకండ్ ఇయర్‌లో మెదక్, నల్లగొండలు చివరిస్థానంలో నిలిచాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement