హైదరాబాద్ లో వర్షం | Rain in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ లో వర్షం

Apr 17 2016 4:00 PM | Updated on Sep 4 2018 5:07 PM

హైదరాబాద్ లో వర్షం - Sakshi

హైదరాబాద్ లో వర్షం

గత కొన్ని రోజులుగా ఎండ వేడితో తల్లడిల్లుతున్న జంటనగరాల ప్రజలకు ఆదివారం కొద్దిగా ఉపశమనం లభించింది.

గత కొన్ని రోజులుగా ఎండ వేడితో తల్లడిల్లుతున్న జంటనగరాల ప్రజలకు ఆదివారం కొద్దిగా ఉపశమనం లభించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. మధ్యాహ్నం తర్వాత వాతావరణంలో మార్పు చోటు చేసుకుని ఆకాశం మేఘావృతంకావడంతో ఉష్ణోగ్రత కొద్దిగా తగ్గింది.

బోడుప్పల్, ఉప్పల్, రామాంతాపూర్, హబ్సిగూడ, ఘట్కేసర్ ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. నాంపల్లి, అబిడ్స్, కోఠి, ఖైరతాబాద్, బషీర్ బాగ్ ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తోంది. ఇక దిల్‌షుక్‌నగర్, కొత్తపేట, చైతన్యపురి, ఎల్బీనగర్, శివారు ప్రాంతాల్లో స్వల్పంగా వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. కొద్ది రోజులుగా పెరిగిన ఎండలతో ఇంట్లో నుంచి బయటకు రావడానికి భయపడుతున్న జనం.. ఒక్కసారిగా చిరుజల్లులతో పాటు పలుకరించిన చల్లటి గాలులతో వారాంతాన్ని ఆస్వాదిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement