కామినేని హాస్పిటల్‌ ఎదుట ఆందోళన


హైదరాబాద్‌: వైద్యుల నిర్లక్ష్యం వల్ల రోగి మృతి చెందాడని ఆరోపిస్తూ.. రోగి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సంఘటన నగరంలోని ఎల్బీనగర్‌ కామినేని ఆస్పత్రిలో బుధువారం వెలుగుచూసింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం లెముర్‌ గ్రామానికి చెందిన బీరప్ప(35) అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స నిమిత్తం కామినేని ఆస్పత్రిలో చేరాడు. కాగా.. ఆస్పత్రిలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మ​ృతిచెందాడంటూ.. అతని కుటుంబసభ్యులు, బంధవులు ఆందోళన చేస్తున్నారు. 
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top