సెల్ టవర్ నిర్మాణం అడ్డగింత...ఉద్రిక్తత | protest against cell tower | Sakshi
Sakshi News home page

సెల్ టవర్ నిర్మాణం అడ్డగింత...ఉద్రిక్తత

Jun 14 2016 4:21 PM | Updated on Sep 4 2017 2:28 AM

సెల్‌టవర్ నిర్మాణం ఉద్రిక్తతకు దారితీసింది.

కుషాయిగూడ: సెల్‌ టవర్ నిర్మాణం ఉద్రిక్తతకు దారితీసింది. చర్లపల్లి డివిజన్ రెడ్డికాలనీలో సెల్ టవర్ నిర్మించేందుకు ఒక సంస్థ పూనుకుంది. అయితే, కాలనీ వాసుల అభ్యర్థనతో ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అయినా సదరు సెల్ టవర్ నిర్మాణ సంస్థ పోలీసుల సాయంతో మంగళవారం ఉదయం నిర్మాణ పనులు చేపట్టింది. కాలనీ వాసులు అడ్డుకోగా పోలీసులు వారిని వారించారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం టవర్ ఏర్పాటు చేస్తున్న ఇంటికి అనుమతులు కూడా సక్రమంగా లేవని స్థానికులు తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే తాము కోర్టును కూడా ఆశ్రయించామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement