నల్సార్ 12వ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి | Pranab to attend NALSAR convocation | Sakshi
Sakshi News home page

నల్సార్ 12వ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి

Aug 1 2014 2:51 AM | Updated on Oct 16 2018 8:54 PM

నల్సార్ 12వ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి - Sakshi

నల్సార్ 12వ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి

నల్సార్ యూనివర్సిటీ 12వ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శనివారం హైదరాబాద్ వస్తున్నారు.

రేపు హైదరాబాద్‌కు రాక

సాక్షి, హైదరాబాద్: నల్సార్ యూనివర్సిటీ 12వ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శనివారం హైదరాబాద్ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రపతి కొత్తరాష్టానికి రావడం ఇదే తొలిసారి. శనివారం మధ్యాహ్నం 3.15 గంటలకు ఢిల్లీ నుంచి ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడ ఆయనకు గవర్నర్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు, ఇతర పార్టీల నాయకులు స్వాగతం పలుకుతారు.
 
ఆ తరువాత రాష్ట్రపతి హెలికాప్టర్‌లో శామీర్‌పేటలోని నల్సార్ యూనివర్సిటీకి వెళతారు. సాయంత్రం 4.15 గంటల నుంచి 5.30 గంటల వరకు నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. అక్కడ నుంచి సాయంత్రం 5.40 గంటలకు హెలికాప్టర్‌లో బయల్దేరి 6.05 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. 6.15 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళతారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement