ముగిసిన శీతాకాల విడిది.. ఢిల్లీకి బయల్దేరిన ప్రణబ్‌ | Pranab mukherjee ends hyderabad tour, leaves for delhi | Sakshi
Sakshi News home page

ముగిసిన శీతాకాల విడిది.. ఢిల్లీకి బయల్దేరిన ప్రణబ్‌

Dec 31 2015 11:43 AM | Updated on Aug 15 2018 9:30 PM

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో శీతాకాల విడిది ముగించుకుని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో శీతాకాల విడిది ముగించుకుని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ప్రణబ్ రాష్ట్రపతి నిలయం నుంచి బయలుదేరి హకీంపేట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి ఎయిర్‌బేస్‌లో గురువారం ఉదయం 11 గంటల సమయంలో ఢిల్లీకి బయల్దేరారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, అధికారులు, మంత్రులు హకీంపేటకు చేరుకుని ఘనంగా ఆయనకు వీడ్కోలు పలికారు. వీరిలో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన మనమడు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ కుమారుడు హిమాన్షు పలువురు ప్రజాప్రతినిధులున్నారు.

శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 31వ తేదీ వరకు ప్రణబ్‌ హైదరాబాద్‌ నగర పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. 10 రోజుల పర్యటనలో ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్రపతి గౌరవార్థం మెన్న సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ విందు ఏర్పాటు చేయగా, నిన్న బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్‌ తేనీటి విందును ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అయుత మహాచండీయాగంలో పాల్గొనేందుకు వెళ్లగా.. ఆ సమయంలో యాగశాలలో అగ్నిప్రమాదం సంభవించడంతో ప్రణబ్‌ హెలికాప్టర్‌లో వెనుదిరిగిన విషయం విదితమే.

Advertisement
 
Advertisement
Advertisement