రాజకీయ దురుద్దేశంతో రాజ్యాంగ ఉల్లంఘన | Politically motivated violation of the Constitution | Sakshi
Sakshi News home page

రాజకీయ దురుద్దేశంతో రాజ్యాంగ ఉల్లంఘన

Nov 8 2016 1:54 AM | Updated on Aug 15 2018 9:35 PM

రాజకీయ దురుద్దేశంతో రాజ్యాంగ ఉల్లంఘన - Sakshi

రాజకీయ దురుద్దేశంతో రాజ్యాంగ ఉల్లంఘన

రాజకీయ దురుద్దేశా లతో, అశాస్త్రీయ పద్ధతులతో జిల్లాలను, మండలాల ను విభజించి సీఎం కేసీఆర్ రాజ్యాంఉల్లంఘనకు పాల్ప డ్డారంటూ

రాష్ట్రపతి, ప్రధానికి రేవంత్ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: రాజకీయ దురుద్దేశా లతో, అశాస్త్రీయ పద్ధతులతో జిల్లాలను, మండలాల ను విభజించి సీఎం కేసీఆర్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్ప డ్డారంటూ రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర ఎన్నికల సంఘానికి టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన జరగకముం దే జిల్లాలను విభజించారని ఆరోపించారు. కేసీఆర్ ఇప్పుడు నియోజకవర్గాల పునర్వి భజన కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నార న్నారు.

నియోజకవర్గాల పునర్విభజన కోసం ఎస్టీలకు రిజర్వు చేసే స్థానాలను రాష్ట్రం మొత్తం ఒక యూనిట్‌గా తీసుకుని రిజర్వేషన్లు చేస్తారని వివరించారు. ఎస్సీ స్థానాలను మాత్రం జిల్లాను ఒక యూనిట్ గా తీసుకుంటారని, ఆయా జిల్లాల్లో అత్యధి క ఎస్సీ జనాభా కలిగిన నియోజకవర్గాలను ఎస్సీలకు రిజర్వు చేస్తారన్నారు. దీనివల్ల ఒకే జిల్లాలో ఎక్కువ ఎస్సీ జనాభా ఉన్న నియోజకవర్గాల్లో ఎస్సీలు నష్టపోతార న్నారు. ప్రతిపక్షాలను దెబ్బకొట్టడానికే కేసీఆర్ ఈ ఆలోచన చేస్తున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement