వ్యభిచార గృహంపై దాడి: ముగ్గురి అరెస్టు | police rides on prostitution houses in hydrebad | Sakshi
Sakshi News home page

వ్యభిచార గృహంపై దాడి: ముగ్గురి అరెస్టు

Oct 3 2015 7:09 PM | Updated on Sep 17 2018 6:26 PM

పోలీసులు వ్యభిచార గృహంపై దాడి చేసి ఇద్దరు మహిళలతో పాటు ఓ నిర్వాహకుడిని అరెస్టు చేశారు.

జీడిమెట్ల: పోలీసులు వ్యభిచార గృహంపై దాడి చేసి ఇద్దరు మహిళలతో పాటు ఓ నిర్వాహకుడిని అరెస్టు చేశారు. ఎస్సై రాములు తెలిపిన వివరాల ప్రకారం.. గాజులరామారం డివిజన్ లాల్ సాహెబ్‌గూడలో జీడిమెట్లకు చెందిన సుల్తాన్(48) అనే వ్యక్తి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలను తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు శనివారం వ్యభిచార గృహంపై దాడిచేసి ఇద్దరు మహిళలతో పాటు నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు మహిళలను పోలీసులు రెస్క్యూహోంకు తరలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement