పోలీసు విభాగంలో స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీసు కానిస్టేబుల్ (ఎస్‌సీటీపీసీఎస్), స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో పోలీసు కానిస్టేబుల్స్, తెలంగాణ స్టేట్ డిజాస్టర్
సాక్షి, హైదరాబాద్: పోలీసు విభాగంలో స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీసు కానిస్టేబుల్ (ఎస్‌సీటీపీసీఎస్), స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో పోలీసు కానిస్టేబుల్స్, తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ డిపార్ట్‌మెంట్‌లో ఫైర్‌మన్ దేహదారుఢ్య, రాత పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులందరూ అటెస్టేషన్ దరఖాస్తులు సమర్పించాలని సైబరాబాద్, రాచకొండ సీపీలు సందీప్ శాండిల్యా, మహేశ్‌భగవత్ సోమవారం ప్రకటించారు.
వీరంతా బుధవారం నుంచి ఈ నెల 10 లోపు సంబంధిత పోలీస్ కమిషనరేట్లలో దరఖాస్తులు అందజేయాలన్నారు. ఒరిజినల్ విద్య, కుల ధృవీకరణ, స్పెషల్ కేటగిరి స్టేటస్ పత్రాలతో పాటు గెజిటెడ్ అధికారి సంతకం చేసిన జిరాక్స్ సెట్ కూడా తీసుకురావాలని తెలిపారు. మంగళవారం నుంచి టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్, ఎస్‌ఎస్‌సీ హాల్‌టికెట్ నంబర్లు ఎంటర్ చేసి ఇంటిమేషన్ లెటర్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు.