పోలీసులకు చిక్కిన బైక్ దొంగ | Police caught Bike thief | Sakshi
Sakshi News home page

పోలీసులకు చిక్కిన బైక్ దొంగ

Oct 31 2015 3:57 PM | Updated on Aug 21 2018 5:52 PM

థియేటర్ పార్కింగ్‌లో పెట్టిన బైక్‌ను దొంగలించిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

థియేటర్ పార్కింగ్‌లో పెట్టిన బైక్‌ను దొంగలించిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన హైదరాబాద్ లోని సాయిబాబా నగర్ క్రాస్ రోడ్డులో శనివారం చోటుచేసుకుంది. క్రాస్‌రోడ్డులో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా తచ్చాడుతున్న వ్యక్తి తారసపడటంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. 

తన పేరు ఎరగండ్ల కుమరయ్య(24) అని రెండు రోజుల క్రితం కాటెదాన్ లోని స్వప్న థియేటర్ పార్కింగ్ నుంచి  హీరో హోండా ఫ్యాషన్ ప్లస్ బైక్‌ను దొంగలించానని చెప్పడంతో అతన్ని అరెస్ట్ చేసి బైక్ స్వాధీనం చేసుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement