ఆరోపణలు చేయడం కాదు,రుజువు చేసే దమ్ముందా! | Parthasarathy open challange to the Minister DEVINENI | Sakshi
Sakshi News home page

ఆరోపణలు చేయడం కాదు,రుజువు చేసే దమ్ముందా!

Nov 24 2016 2:24 AM | Updated on Jul 25 2018 4:09 PM

ఆరోపణలు చేయడం కాదు,రుజువు చేసే దమ్ముందా! - Sakshi

ఆరోపణలు చేయడం కాదు,రుజువు చేసే దమ్ముందా!

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తే సరిపోదు.. వాటిని నిరూపించే దమ్ముందా! అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారపార్టీకి సవాలు విసిరింది.

మంత్రి దేవినేనికి వైఎస్సార్ కాంగ్రెస్ సవాల్

 సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తే సరిపోదు.. వాటిని నిరూపించే దమ్ముందా! అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారపార్టీకి సవాలు విసిరింది. పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ దివీస్ ల్యాబొరేటరీ నెలకొల్పడాన్ని వ్యతిరేకిస్తూ తూర్పుగోదావరి జిల్లాలో జగన్ పాల్గొన్న సభ విజయవంతం కావడంతో జీర్ణించుకోలేక మంత్రి దేవినేని ఉమా పాచినోటితో నోటికొచ్చినట్లు అసత్య ఆరోపణలు చేశారని ధ్వజమెత్తారు. నిజంగా అధికారపార్టీ నేతలకు దమ్ముంటే నిజారుుతీగల పోలీసు అధికారులతో ఇడుపులపాయలోని ప్రతి అంగుళం వెతుక్కోవచ్చని, అక్కడేమీ దొరక్కపోతే సీఎం చంద్రబాబుతో క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement