దీక్షపై హేళనగా మాట్లాడతారా? | pallam raju slams ap government on kapu stand | Sakshi
Sakshi News home page

దీక్షపై హేళనగా మాట్లాడతారా?

Jun 17 2016 5:01 PM | Updated on Aug 18 2018 8:05 PM

దీక్షపై హేళనగా మాట్లాడతారా? - Sakshi

దీక్షపై హేళనగా మాట్లాడతారా?

ముద్రగడ పద్మనాభం నిరాహారదీక్షపైన, కాపుల రిజర్వేషన్ల అంశంపైన ఏపీ రాష్ట్ర మంత్రులు హేళనగా మాట్లాడటం సరికాదని కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పళ్లంరాజు అన్నారు.

ముద్రగడ పద్మనాభం నిరాహారదీక్షపైన, కాపుల రిజర్వేషన్ల అంశంపైన ఏపీ రాష్ట్ర మంత్రులు హేళనగా మాట్లాడటం సరికాదని కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పళ్లంరాజు అన్నారు. ముద్రగడ కుటుంబంపై జరిగిన దాడిని యావత్ జాతిపై జరిగిన దాడిగా చూడాలని ఆయన చెప్పారు. శుక్రవారం సాయంత్రం కాపు ప్రముఖుల సమావేశం ఉన్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

ముద్రగడ దీక్ష పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చిస్తామన్నారు. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాత్రమే తాము అడుగుతున్నామని, తమ డిమాండులో న్యాయం ఉందని అయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement