మద్యంసేవిస్తూ వ్యక్తి మృతి | one died while taking liquor at hayathnagar | Sakshi
Sakshi News home page

మద్యంసేవిస్తూ వ్యక్తి మృతి

Nov 13 2015 10:11 PM | Updated on Sep 3 2017 12:26 PM

బార్‌లో మద్యం సేవిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన శుక్రవారం హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

హయత్‌నగర్: బార్‌లో మద్యం సేవిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన శుక్రవారం హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హయత్‌నగర్ డివిజన్‌లోని శుభోదయకాలనీలో నివసించే కర్రోళ్ల కృష్ణ (45) కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

శుక్రవారం మధ్యాహ్నం హయత్‌నగర్‌లోని ఓ బార్‌లో మద్యం సేవిస్తూ టేబుల్ మీద కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. మద్యం సేవిస్తున్న వ్యక్తి హఠాత్తుగా మృతి చెందడంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement