2,437 పోస్టులకు నోటిఫికేషన్‌! | Notification for 2,437 posts! | Sakshi
Sakshi News home page

2,437 పోస్టులకు నోటిఫికేషన్‌!

May 31 2017 1:05 AM | Updated on Sep 5 2017 12:22 PM

2,437 పోస్టులకు నోటిఫికేషన్‌!

2,437 పోస్టులకు నోటిఫికేషన్‌!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్‌ 2న వివిధ కేటగిరీలకు చెందిన 2,437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది.

జూన్‌ 2న ప్రకటన... అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన టీఎస్‌పీఎస్సీ
 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్‌ 2న వివిధ కేటగిరీలకు చెందిన 2,437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మంగళవారం జరిగిన సమీక్షలో వెల్లడించింది. ఆ 2,437 పోస్టుల్లో అధిక సంఖ్యలో గురుకుల డిగ్రీ కాలేజీల లెక్చరర్లు, వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్లు, నీటి పారుదల శాఖ, ఆర్‌ అండ్‌ బీ, ట్రైబల్‌ వెల్ఫేర్‌ తదితర శాఖల్లో సివిల్, ఎలక్ట్రికల్‌ అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ పోస్టులు ఉన్నాయి.

అలాగే ములుగులోని ఫారెస్ట్స్‌ కాలేజ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రొఫెసర్లు, లైబ్రేరియన్‌ పోస్టులు ఉన్నాయి. మొత్తంగా జూన్‌ 2న 2437 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేయనుంది.

Advertisement
 
Advertisement
Advertisement