ఓయూలో సభలకు అనుమతిలేదు: రిజిస్ట్రార్ | no permissions for meetings in OU | Sakshi
Sakshi News home page

ఓయూలో సభలకు అనుమతిలేదు: రిజిస్ట్రార్

Jun 1 2016 8:42 PM | Updated on Jul 31 2018 4:48 PM

ఓయూలో ఎటువంటి సభల నిర్వహణకు అనుమతి లేదని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సురేష్‌కుమార్ తెలిపారు.

హైదరాబాద్: ఓయూలో ఎటువంటి సభల నిర్వహణకు అనుమతి లేదని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సురేష్‌కుమార్ తెలిపారు. బుధవారం ఓయూలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యకు, విద్యార్థులకు సంబంధం లేని రాజకీయ సభలను నిర్వహించ కూడదన్నారు. అనుమతి లేకుండా నిర్వహించే సభలపై పోలీసు కేసులు పెట్టనున్నట్లు తెలిపారు. బయటి వ్యక్తులు ముఖ్యంగా రాజకీయ నాయకులు ఓయూకు రావాలంటే అనుమతి తీసుకోవాలన్నారు. 2  వతేదీ ఓయూలో జరిగే తెలంగాణ జన జాతర సభకు టీవీ ఛానెళ్ల వోబీ వ్యాన్లను కూడా అనుమతించబోమన్నారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోనున్నట్లు రిజిస్ట్రార్ హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement