నో ఇగోస్! | No igos! | Sakshi
Sakshi News home page

నో ఇగోస్!

Jan 31 2015 12:10 AM | Updated on Sep 2 2017 8:32 PM

నో ఇగోస్!

నో ఇగోస్!

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌బచ్చన్ రోజురోజుకూ అభిమానులకు మరింత దగ్గరవుతున్నాడు.

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌బచ్చన్ రోజురోజుకూ అభిమానులకు మరింత దగ్గరవుతున్నాడు. ఎంత స్టార్‌డమ్ సంపాదించినా... ఎంతటి వారితోనైనా కలసిపోయే స్వభావి అమితాబ్. చిన్నా... పెద్దా అన్న తేడా లేకుండా ఏ హీరో సినిమాలో అయినా చేసేస్తున్న బిగ్ బీ తనకసలు ఇగోనే లేదంటున్నాడు.

తమిళ కుర్ర హీరో ధనుష్‌తో కలసి నటించిన ‘షమితాబ్’ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా తన గురించీ కాస్త చెప్పుకున్నాడు మెగాస్టార్. ‘ఇతర నటుల గురించి నాకు తెలియదు. నావరకైతే... ఇగో అన్న పదమే లేదు. ఇప్పటికీ అదేంటో నాకు తెలియదు. అలాగే స్వప్రయోజనాలకు కూడా నా లైఫ్‌లో ఇంపార్టెన్స్ లేదు’ అని చెప్పాడీ షమితాబ్!

Advertisement
 
Advertisement
Advertisement