breaking news
Igos
-
నవతరం ప్రేమకథ
‘ఆకతాయి’ సినిమా ఫేమ్ ఆశిష్‌రాజ్, సిమ్రాన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఇగో’ (ఇందు–గోపి). సుబ్రమణ్యం దర్శకత్వంలో ‘ఆకతాయి’ నిర్మాతలు విజయ్ కరణ్–కౌసల్ కరణ్–అనిల్ కరణ్ నిర్మించిన ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ నెల 19న విడుదల చేయాలనుకుంటున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘హిలేరియస్ అండ్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ మూవీ. నవతరం ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా యువతరంతోపాటు పెద్దలకూ నచ్చేలా ఉంటుంది. ఈ సినిమాతో ఆశిష్రాజ్కి మంచి బ్రేక్ వస్తుంది. సిమ్రాన్, దీక్షాపంత్ పాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సాయి కార్తీక్ పాటలకు మంచి స్పందన వచ్చింది. తన నేపథ్య సంగీతం సినిమాకి హెల్ప్ అవుతుంది. తప్పకుండా మా సినిమా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు. రావు రమేశ్, పోసాని కృష్ణమురళి, పృథ్వీ, అజయ్, ‘షకలక’ శంకర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్ జి.కె. -
నో ఇగోస్!
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌బచ్చన్ రోజురోజుకూ అభిమానులకు మరింత దగ్గరవుతున్నాడు. ఎంత స్టార్డమ్ సంపాదించినా... ఎంతటి వారితోనైనా కలసిపోయే స్వభావి అమితాబ్. చిన్నా... పెద్దా అన్న తేడా లేకుండా ఏ హీరో సినిమాలో అయినా చేసేస్తున్న బిగ్ బీ తనకసలు ఇగోనే లేదంటున్నాడు. తమిళ కుర్ర హీరో ధనుష్‌తో కలసి నటించిన ‘షమితాబ్’ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా తన గురించీ కాస్త చెప్పుకున్నాడు మెగాస్టార్. ‘ఇతర నటుల గురించి నాకు తెలియదు. నావరకైతే... ఇగో అన్న పదమే లేదు. ఇప్పటికీ అదేంటో నాకు తెలియదు. అలాగే స్వప్రయోజనాలకు కూడా నా లైఫ్‌లో ఇంపార్టెన్స్ లేదు’ అని చెప్పాడీ షమితాబ్!