
ఢిల్లీ వీధుల్లో ఛేజింగ్..!
తన వద్ద ఉన్న కోట్ల డాలర్లతో వ్యాపారం చేద్దామంటూ నిజామాబాద్‌కు చెందిన వ్యాపారితో యువతిలా చాటింగ్ చేసి..
⇒ నైజీరియన్‌ను పట్టుకోవడానికి సీసీఎస్ పోలీసుల వల
⇒ పోలీసులపై దాడికి తెగబడిన నైజీరియన్లు
⇒ చాకచక్యంగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్న అధికారులు
సాక్షి, హైదరాబాద్: తన వద్ద ఉన్న కోట్ల డాలర్లతో వ్యాపారం చేద్దామంటూ నిజామాబాద్‌కు చెందిన వ్యాపారితో యువతిలా చాటింగ్ చేసి.. రూ.లక్షల్లో చీటింగ్ చేసిన ముఠా గుట్టును హైదరాబాద్ నగర నేర పరిశోధన విభాగం(సీసీఎస్) ఆధీనంలోని సైబర్ క్రైమ్ అధికారులు రట్టు చేశారు. ఢిల్లీలో ఈ గ్యాంగ్ సూత్రధారిగా ఉన్న నైజీరియన్‌ను పట్టుకునే యత్నంలో సోమవారం భారీ ఛేజింగ్ జరిగింది. స్థానికంగా ఉన్న మరికొందరు నైజీరియన్లు పోలీసులపై దాడికి యత్నించగా.. అధికారులు చాకచక్యంగా వ్యవహరించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
ఫేస్‌బుక్‌లో పరిచయమై: నిజామాబాద్‌కి చెందిన వ్యాపారి సాయిప్రసాద్ వ్యాపారాలు చేస్తున్నారు. అతడి ఫేస్‌బుక్ ఖాతా ద్వారా విదేశీ యువతిగా నైజీరియన్లు పరిచయమయ్యారు. కొన్ని రోజులు చాటింగ్ చేసిన నేరగాళ్లు ఆపై తానో వ్యాపారినని, అమెరికా, లం డన్‌లో బిజినెస్‌లు చేస్తుంటానని నమ్మబలి కారు. అనివార్య కారణాల నేపథ్యంలో తన వద్ద ఉన్న భారీ మొత్తం భారత్‌కు పంపిస్తామని, ఆ మొత్తం వెచ్చించి వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలని, వచ్చిన లాభంలో తనకు సగం వాటా ఇవ్వాలని ‘బంపర్ ఆఫర్’ ఇచ్చారు. వీరి వల్లో పడిన వ్యాపారి నుంచి వివిధ రకాల పేర్లు చెప్పి భారీగా డబ్బు దండుకోవడం మొదలెట్టారు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇన్‌స్పెక్టర్ కేవీఎం ప్రసాద్ నేతృత్వంలోని బృందం ఢిల్లీ కేంద్రంగా ఈ మోసం జరిగినట్లు గుర్తించింది.
డెకాయ్ ఆపరేషన్‌తో..
మోసగాళ్లు ఇప్పటికీ సాయిప్రసాద్‌తో సంప్రదింపులు జరుపుతుండటంతో పోలీసులు వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని నిర్ణయించారు. ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ నేతృత్వంలోని బృందం డెకాయ్ ఆపరేషన్ చేపట్టింది. సాయిప్రసాద్ ద్వారానే నేరగాళ్లను సంప్రదిం చి, రూ.25 లక్షలు తీసుకువచ్చామని చెప్పిం చింది. ఈ నగదు తీసుకోవడానికి ప్రధాన నిందితుడు వస్తాడని, అప్పుడు అతడిని పట్టుకోవాలని ప్లాన్ చేసింది. తొలుత సూత్రధారి రాకుండా అతడి అనుచరుడైన మరో నైజీరియన్‌ను పంపాడు. అతడిని అదుపులోకి తీసుకున్న అధికారులు, అనుచరుడి ద్వారానే ఫోన్ చేయించి, నగదు అందినట్లు చెప్పించారు.
సూత్రధారి ఈ మాటలు నమ్మి డబ్బు తీసుకోవాలనే ఉద్దేశంతో పోలీసులు ఉన్న చోటుకు వచ్చాడు. పోలీసులను పసిగట్టి∙పారిపోయే యత్నం చేశాడు. సైబర్ క్రైమ్ పోలీసులు అతడిని వెంబడించి పట్టుకున్నా రు. ఆ ప్రాంతంలోనే ఉన్న మరికొందరు నైజీ రియన్లు పోలీసులపై దాడి చేసి, అదుపులో ఉన్న వారిని విడిపించేందుకు యత్నించారు. పోలీసులకు స్వల్ప గాయాలైనా నేరగాళ్లను విడిచిపెట్టలేదు. చాకచక్యంగా వ్యవహరించి న హైదరాబాద్ బృందం స్థానిక పోలీసుల సాయంతో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిం ది. వీరిని అక్కడి కోర్టులో హాజరుపరిచి పీటీ వారెంట్‌పై నగరానికి తీసుకురానుంది.