తుపాకులు.. తూటాలు! | Nayeem SHADNAGAR den video to came out | Sakshi
Sakshi News home page

తుపాకులు.. తూటాలు!

Jun 12 2017 1:12 AM | Updated on Aug 21 2018 6:00 PM

తుపాకులు.. తూటాలు! - Sakshi

తుపాకులు.. తూటాలు!

గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌కు చెందిన కీలక వీడియో ఆదివారం వెలుగులోకి వచ్చింది.

బయటకు వచ్చిన నయీమ్‌ షాద్‌నగర్‌ డెన్‌ వీడియో
 
సాక్షి, హైదరాబాద్‌: గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌కు చెందిన కీలక వీడియో ఆదివారం వెలుగులోకి వచ్చింది. అతడి ఎన్‌కౌంటర్‌కు ముందు తలదాచుకున్న షాద్‌నగర్‌ మిలీనియమ్‌ టౌన్‌షిప్‌లోని ఉనూర్‌ బాషా ఇంటి లోపలి వీడియోలు మీడియాలో హల్‌చల్‌ చేశాయి. అక్కడి నయీమ్‌ బెడ్‌రూమ్‌ నుంచి వెలికితీసిన తుపాకులు, తూటాలు, కత్తులు ఈ వీడియోలో కనిపించాయి. మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్న నయీముద్దీన్‌ గత ఏడాది ఆగస్టు 8న షాద్‌నగర్‌లోని మిలీనియమ్‌ టౌన్‌షిప్‌లో ఎన్‌కౌంటర్‌ అయ్యాడు. ఈ ప్రాంతానికి పక్కనే ఉన్న బాషా ఇల్లే నయీమ్‌ డెన్‌గా గుర్తించిన పోలీసులు అదే రోజు సోదాలు చేశారు.

అప్పట్లో అధికారులు ఈ ఇంట్లో భారీ మొత్తం నగదు, డాక్యుమెంట్లు, ఆయుధాలు గుర్తించారు. బెడ్‌రూమ్‌లోని బీరువా సమీపం లో రెండు కవర్లలో భారీ సంఖ్యలో ఉన్న తూటాలు, ఓ బ్యాగ్‌లో ఉంచిన కార్బైన్, రివాల్వర్‌తో పాటు మరో కవర్‌లో ఉన్న రెండు కత్తుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని వీడియో ద్వారా చిత్రీకరించారు. అప్పటి నుంచి గోప్యంగా ఉండి పోయిన ఈ వీడియో పది నెలల తర్వాత వెలుగులోకి వచ్చి ఆదివారం హల్‌చల్‌ చేసింది.  
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement