ఫేస్బుక్ నిండా తాత జ్ఞాపకాలే | Nandamuri Janakiram facebook with grand father NTR memories | Sakshi
Sakshi News home page

ఫేస్బుక్ నిండా తాత జ్ఞాపకాలే

Dec 7 2014 8:55 AM | Updated on Aug 30 2018 3:56 PM

ఫేస్బుక్ నిండా తాత జ్ఞాపకాలే - Sakshi

ఫేస్బుక్ నిండా తాత జ్ఞాపకాలే

ప్రమాదవశాత్తూ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన నందమూరి హరికృష్ణ తనయుడు జానకీరామ్‌కు తాత స్వర్గీయ ....

సిటీబ్యూరో: ప్రమాదవశాత్తూ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన నందమూరి హరికృష్ణ తనయుడు జానకీరామ్‌కు తాత స్వర్గీయ ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం. అందుకు గుర్తుగా చిన్నతనంలో తాతతో కలిసి దిగిన ఫొటోలు, ఎన్టీఆర్‌కు సంబంధించిన కార్టూన్లు, ఫొటోలను  ఫేస్ బుక్‌లో భద్రపరుచుకున్నారు. అంతే కాదు తన కుమారునికి సైతం నందమూరి తారకరామారావు(ఎన్టీఆర్)అని పేరు పెట్టుకు న్నారు.

1977లో ఎన్టీఆర్ దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు నటించిన చాణక్యచంద్రగుప్త సినిమా షూటింగ్ సమయంలో అక్కినేని జానకీరామ్‌ను ఎత్తుకుని దిగిన ఫొటోను ఫేస్‌బుక్‌లో భద్రంగా దాచుకున్నారు. చిన్నతనంలో ఏఎన్‌ఆర్, ఎన్టీఆర్‌లతో కలిసి ఫొటో దిగడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఫేస్‌బుక్‌లో రాసుకున్నారు.    
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement