'కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారు' | MLC Ramchander Rao criticised KCR | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారు'

Jun 16 2016 6:30 PM | Updated on Aug 15 2018 9:30 PM

తెలంగాణలో చేయాల్సింది చేయకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంపై దుష్రచారం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు విమర్శించారు.

హైదరాబాద్: తెలంగాణలో చేయాల్సింది చేయకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంపై దుష్రచారం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు విమర్శించారు. హైదరాబాద్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కార్పొరేట్ స్కూళ్లతో టీఆర్ఎస్ ప్రభుత్వం కుమ్మక్కైందని ఆరోపించారు. ప్రైవేట్ స్కూళ్ల దోపిడీ కేసీఆర్కు కనిపించడం లేదా అని సూటిగా ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని జలవివాదాలను పరిష్కరించుకోవాలని ఎమ్మెల్సీ రామచంద్రరావు సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement