రాజస్థాన్‌లో అదృశ్యం..శామీర్పేటలో ప్రత్యక్షం | missing rajasthani man found in hyderabad | Sakshi
Sakshi News home page

రాజస్థాన్‌లో అదృశ్యం..శామీర్పేటలో ప్రత్యక్షం

May 26 2016 8:06 PM | Updated on Aug 29 2018 8:36 PM

రాజస్థాన్‌లో అదృశ్యమైన వ్యక్తిని గుర్తించిన శామీర్‌పేట్ పోలీసులు సురక్షితంగా వారి కుటుంబీకులకు అప్పగించారు.

-సురక్షింతంగా కుటుంబీకులకు అప్పగించిన శామీర్‌పేట్ పోలీసులు
-ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన కుటుంబీకులు


శామీర్‌పేట్: రాజస్థాన్‌లో అదృశ్యమైన వ్యక్తిని గుర్తించిన శామీర్‌పేట్ పోలీసులు సురక్షితంగా వారి కుటుంబీకులకు అప్పగించారు. ఈ సంఘటన శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. శామీర్‌పేట్ సీఐ సత్తయ్య తెలిపిన వివరాలు...బిహార్ రాష్ట్రం జూర్జాదర్బంగ జిల్లా ప్రాంతానికి చెందిన సుకన్ పాశ్వాన్ కుమారుడు భానుపాశ్వాన్‌కు మతిస్థిమితం సరిగా లేదు. కాగా గత కొంత కాలంగా రాజస్థాన్ రాష్ట్రంలోని సందారి ప్రాంతంలో నివాసం ఉంటున్న సుకన్ బావమరిది జాని పాశ్వాన్ వద్ద భాను పాశ్వాన్ ఉంటున్నాడు. ఈ క్రమంలో ఈనెల 24న ఇంటి నుంచి బయటకు వెళ్లిన భాను పాశ్వాన్ అదృశ్యమయ్యాడు.

కాగా శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం అనుమాన స్పద స్థితిలో తిరుగుతున్న ఓ వ్యక్తిని గుర్తించిన శామీర్‌పేట్ పోలీసులు విచారణ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సదరు వ్యక్తి వివరాలు సేకరించగా అతడు రాజస్థాన్ రాష్ట్రంలోని సందారిలో తప్పిపోయిన భాను పాశ్వాన్‌గా గుర్తించారు. అనంతరం వారి కుటుంబీకులకు సమాచారం అందించారు. దీంతో భానుపాశ్వాన్ కుటుంబీకులు శామీర్‌పేట్‌పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement