breaking news
shameer pet
-
లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన ఎంఆర్వో సుచరిత
సాక్షి,హైదరాబాద్: ఏసీబీ అధికారులకు శామీర్ పేట్ ఎమ్మెఆర్వో సుచరిత రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. భూమి నాలా కన్వెర్షన్‌కి సుచరిత ఎకరాకు లక్షరేట్ కార్డ్ ఫిక్స్ చేశారు. 30ఎకరాల భూమి కన్వెర్షన్‌కి 30లక్షలు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా అడ్వాన్స్‌గా సుచరిత కారు డ్రైవర్ రూ.2లక్షలు తీసుకున్నారు. ఆ డబ్బును సుచరితకు ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. డబ్బు గురించి ప్రశ్నింగా సుచరిత, ఆమె డ్రైవర్ నీళ్లు నమిలారు.ఎమ్మార్వో సుచరిత శామీర్‌పేట్ ఆఫీస్‌నే అవినీతికి అడ్డాగా మార్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మధ్యాహ్నం నుంచి ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో ఈ తనిఖీలు చేపట్టారు. అనంతరం మీడియాతో ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ.. శామీర్‌పేట మండలం ఆలియాబాద్ ప్రాంతంలో సుమారు 30 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించి రైతు కన్సల్టెంట్ నుంచి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసినట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.ఎకరానికి రూ.1 లక్ష చొప్పున మొత్తం రూ.30 లక్షలు డిమాండ్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. ఈ వ్యవహారంలో తహసీల్దార్ డ్రైవర్ ద్వారా రూ.2 లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కార్యాలయంలోని కీలక పత్రాలు, భూ అనుమతులకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నామని, ఎమ్మార్వో సుచరితతో పాటు ఆర్డీఓ కీసర రాజేష్ పలువురు సిబ్బందిని విచారిస్తున్నామని తెలిపారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.2024లో శామీర్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసిన ఎమ్మార్వో సత్యనారాయణ రూ.2 లక్షల లంచం కేసులో డ్రైవర్‌తో కలిసి ఏసీబీకి చిక్కిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. తాజాగా మరోసారి అదే కార్యాలయంలో ఏసీబీ దాడులు జరగడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. -
రాజస్థాన్‌లో అదృశ్యం..శామీర్‌పేటలో ప్రత్యక్షం
-సురక్షింతంగా కుటుంబీకులకు అప్పగించిన శామీర్‌పేట్ పోలీసులు -ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన కుటుంబీకులు శామీర్‌పేట్: రాజస్థాన్‌లో అదృశ్యమైన వ్యక్తిని గుర్తించిన శామీర్‌పేట్ పోలీసులు సురక్షితంగా వారి కుటుంబీకులకు అప్పగించారు. ఈ సంఘటన శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. శామీర్‌పేట్ సీఐ సత్తయ్య తెలిపిన వివరాలు...బిహార్ రాష్ట్రం జూర్జాదర్బంగ జిల్లా ప్రాంతానికి చెందిన సుకన్ పాశ్వాన్ కుమారుడు భానుపాశ్వాన్కు మతిస్థిమితం సరిగా లేదు. కాగా గత కొంత కాలంగా రాజస్థాన్ రాష్ట్రంలోని సందారి ప్రాంతంలో నివాసం ఉంటున్న సుకన్ బావమరిది జాని పాశ్వాన్ వద్ద భాను పాశ్వాన్ ఉంటున్నాడు. ఈ క్రమంలో ఈనెల 24న ఇంటి నుంచి బయటకు వెళ్లిన భాను పాశ్వాన్ అదృశ్యమయ్యాడు. కాగా శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం అనుమాన స్పద స్థితిలో తిరుగుతున్న ఓ వ్యక్తిని గుర్తించిన శామీర్‌పేట్ పోలీసులు విచారణ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సదరు వ్యక్తి వివరాలు సేకరించగా అతడు రాజస్థాన్ రాష్ట్రంలోని సందారిలో తప్పిపోయిన భాను పాశ్వాన్‌గా గుర్తించారు. అనంతరం వారి కుటుంబీకులకు సమాచారం అందించారు. దీంతో భానుపాశ్వాన్ కుటుంబీకులు శామీర్పేట్పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.


