కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడిగితే మంత్రులకు కోపం వస్తుందని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చెప్పారు.
సికింద్రాబాద్: కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడిగితే మంత్రులకు కోపం వస్తుందని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చెప్పారు. ఆదివారం సికింద్రాబాద్‌లో కాపు నేతల ఆత్మీయ సభకు ముద్రగడ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు కాపులను చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. ఇదే ఆఖరి పోరాటమన్నారు. హామీలను సాధించుకునే విషయంలో తాము వెనుకంజ వేసే ప్రసక్తే లేదని ముద్రగడ స్పష్టం చేశారు.