పవన్‌ కల్యాణ్‌కు మంత్రి హరీశ్‌రావు చురక | minister harish rao fire on pawan kalyan | Sakshi
Sakshi News home page

పవన్‌ కల్యాణ్‌కు మంత్రి హరీశ్‌రావు చురక

Jul 8 2015 4:17 PM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్‌ కల్యాణ్‌కు మంత్రి హరీశ్‌రావు చురక - Sakshi

పవన్‌ కల్యాణ్‌కు మంత్రి హరీశ్‌రావు చురక

ఓటుకు కోట్లు కేసులో ఖమ్మం ఎమ్మెల్యే సండ్ర వీరయ్యను ఉద్దేశపూర్వకంగానే ఏసీబీ పోలీసులు అరెస్ట్ చేశారని ...

పుల్‌కల్: ఓటుకు కోట్లు కేసులో ఖమ్మం ఎమ్మెల్యే సండ్ర వీరయ్యను ఉద్దేశపూర్వకంగానే ఏసీబీ పోలీసులు అరెస్ట్ చేశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించడం సరైంది కాదని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నా రు.

మెదక్ జిల్లా పుల్కల్ మండలం సింగూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ టీడీపీపై వ్యాఖ్యానించకుండా టీఆర్‌ఎస్ టార్గెట్‌గా విమర్శలు చేయడం పవన్‌కు తగదన్నారు. పవన్ కల్యాణ్ తన స్థాయిని గుర్తించి మాట్లాడాలని సూచించారు. ఓ వైపు తెలంగాణ సీఎం కేసీఆర్ను అభినందిస్తూనే మరోవైపు విమర్శించడం భావ్యం కాదన్నారు.

 
 

Advertisement
 
Advertisement
Advertisement