నేడు హైదరాబాద్‌కు మీరాకుమార్‌ | Meerakumar to Hyderabad today | Sakshi
Sakshi News home page

నేడు హైదరాబాద్‌కు మీరాకుమార్‌

Jul 3 2017 3:33 AM | Updated on Mar 18 2019 7:55 PM

నేడు హైదరాబాద్‌కు మీరాకుమార్‌ - Sakshi

నేడు హైదరాబాద్‌కు మీరాకుమార్‌

కాంగ్రెస్‌తోపాటు 18 రాజకీయ పక్షాల మద్దతు కలిగిన యూపీఏ అభ్యర్థి మీరాకుమార్‌ సోమవారం హైదరాబాద్‌కు రానున్నారు.

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌తోపాటు 18 రాజకీయ పక్షాల మద్దతు కలిగిన యూపీఏ అభ్యర్థి మీరాకుమార్‌ సోమవారం హైదరాబాద్‌కు రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గాంధీభవన్‌కు చేరుకుని, కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యనేతలతో సమావేశం అవుతారు. ఆ  సమావేశం ముగిసిన తరువాత మీరాకుమార్‌ విలేకరులతో మాట్లాడనున్నారు.

తరువాత బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. అనంతరం నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ సొసైటీ భవనంలో కాంగ్రెస్‌ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వామపక్ష పార్టీల నేతలు, వివిధ రంగాల ముఖ్యులు, మీడియా ప్రముఖులతో భేటీ అవుతారు. అక్కడే అందరితో కలసి మధ్యాహ్న భోజనం చేసి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.  

Advertisement
 
Advertisement
Advertisement