మెడికల్‌ కాలేజీల్లో ప్రవేశాల షెడ్యూల్‌ విడుదల | medical collage entrance exam shedule released by kaloji health university | Sakshi
Sakshi News home page

మెడికల్‌ కాలేజీల్లో ప్రవేశాల షెడ్యూల్‌ విడుదల

Jul 6 2017 7:35 PM | Updated on Oct 30 2018 7:57 PM

రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో 2017–18 విద్యా సంవత్సరానికి కన్వీనరు (కాంపిటెంట్‌ అథారిటీ) కోటా ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సులలో సీట్ల భర్తీ ప్రక్రియను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది.

హైదరాబాద్‌:
రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో 2017–18 విద్యా సంవత్సరానికి కన్వీనరు (కాంపిటెంట్‌ అథారిటీ) కోటా ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సులలో సీట్ల భర్తీ ప్రక్రియను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. జాతీయ స్థాయి అర్హత ప్రవేశ పరీక్ష(నీట్‌) ర్యాంకు ప్రకారం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. జూన్‌ 9న ఉదయం 11 గంటల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ మొదలవుతుందని పేర్కొంది.

జూన్‌ 18న సాయంత్రం 5 గంటలకు ఈ ప్రక్రియ ముగుస్తుందని తెలిపింది. www.knruhs.in, http://medadm.tsche.in వెబ్‌సైట్లలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారి వివరాల ఆధారంగా కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం మెరిట్‌ జాబితాను ప్రకటిస్తుంది. అనంతరం ర్యాంకుల ప్రకారం అభ్యర్థుల విద్యార్హత సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. ఈ ప్రక్రియ తర్వాత మరోసారి మెరిట్‌ జాబితాను ప్రకటిస్తారు. అనంతరం అభ్యర్థులు ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్ల కోసం ఆన్‌లైన్‌లో ఆప్షన్లు ఇస్తారు. అభ్యర్థుల ఆప్షన్లను పరిశీలించి మెరిట్‌ ప్రకారం కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం సీట్లను కేటాయిస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement